TULASEE VANAM

Indian BrahminsTULASEE VANAM
బ్రాహ్మణ బాలికలు ఇంటర్ డిగ్రీ లో చేరే వారు వెంటనే వచ్చి అడ్మిషన్ పొంది వెళ్ళండి. ఉచిత హాస్టల్ లభిస్తుంది. అలాగే తల్లి తండ్రుల ఆదాయాన్ని పరిస్థితిని బట్టి ఫీజ్ 100% రియంబర్స్ మెంట్ లభిస్తుందిB 20 ఏళ్లుగా ధన్వంతరి ఫౌండేషన్ పేరుతొ కోట్లాది రూపాయలను వివిధ రకాలైన పేర్లతో బ్రాహ్మణుల వద్ద అధిక వడ్డీల పేరుతొ కలెక్ట్ చేసిన పంతంగి కమలాకర శర్మ & అతని భార్య. బ్రాహ్మణులకు కుచ్చు టోపీ పెట్టారు. గత రెండేళ్లుగా మొహం చాటేసిన కమలాకర శర్మ పై సి సి ఎస్ లో కేసు నమోదు అయి జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చి ఇంకా మోసం చెయ్యాలని చూస్తూనే ఉన్నాడు పంతంగి కమలాకర శర్మ గాని ధన్వంతరి లో పని చేసే వారు గాని ఎవరు కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వరాదు, ఎలాంటి క్రయ విక్రయాలు చెయ్యరాదు, ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు చెయ్యరాదు ... సి సి ఎస్ పోలీస్ ... ఇది కమలాకర శర్మ పరిస్థితి.

Free Hostel and Education for Brahmin Girls.

తులసీవనం అనే ఈ ఉచిత బ్రాహ్మణ బాలికల హాస్టల్ లో పద్దతిగా ఉండే బ్రాహ్మణ ఆడపిల్లలు నేరుగా వచ్చి జాయిన్ అవ్వచ్చు, తల్లి తండ్రుల అనుమతి తప్పని సరి.
అలాగే Inter, నుండి Degree, B.Tech, MCA, MBA, Pharmacy Courses, all PG Courses.,అన్ని కోర్సులు తల్లి తండ్రుల ఆర్ధిక పరిస్థితి మరియు ఆదాయాన్ని బట్టి 100% రియంబర్స్ మెంట్ పద్దతిలో ఉచితంగా చదువ వచ్చు., బ్రాహ్మణ నిరుద్యోగ యువతులు ఇక్కడ కొన్ని శిక్షణలు పొందవచ్చు .. ఉచితంగానే .. అలాగే ఇక్కడ ఉండవచ్చు.

గత ఏడాది కొంతమంది ప్రవర్తన వల్ల ఈ ఏడాది కండిషన్ లు మరింత స్ట్రిక్ట్ గా పెట్టడం జరిగింది … హాస్టల్ లో చేరే ముందే అన్ని మాట్లాడుకుని , కండిషన్ లు ఒప్పుకుంటేనే చేరాలి .. తర్వాత మాటలు మాట్లాడితే నడువదు. మీ పిల్లలు మీకు ముఖ్యమే కానీ ఇక్కడ పద్ధతులు పాటించాలి , సంప్రదాయాలు పాటించాలి , చక్కగా చదవాలి .. చదువు తక్కువ ఇతర అలవాట్లు ఎక్కువ ఉండే పిల్లలు మాకు అవసరం లేదు. ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటె ముందే చేరకండి. పిల్లలకు మీరు సరిగా చెప్పి పంపాలి. ఇక్కడ ఉంటె 90% రీచ్ అవ్వాలి. ఎదో టైం పాస్ కు చేరితే ఇక్కడ నడువదు.. ఇది సంపాదించుకునేందుకు పెట్టిన హాస్టల్ కాదు. మన పిల్లలను ఇంటర్ నుండి వారి చదువు అయ్యేదాకా కూడా జాగ్రత్తగా కాపాడుకుని, మంచి మార్కులతో ఎదిగి మంచి ఉద్యోగం చేసేలా చేసి తల్లి తండ్రుల చేతిలో పెట్టాలని కంకణం కట్టుకుని నడుపుతున్న హాస్టల్ ఇది. కనుక మాకు పిల్లలు జాయిన్ అవ్వక పోయినా పరవాలేదు గాని ఇక్కడ చేరిన పిల్లలు మాత్రం మంచి అలవాట్లతో, మంచి మార్కులతో ఎదగాలని మా ఆకాంక్ష , ప్రయత్నం.

NOTICE BOARD
JUNE 2024

TERMS AND CONDITIONS FOR FREE HOSTEL ADMISSIONS

========

Read this website and admission process celarly .. before admission you have to submit an agreement copy of  terms and conditions on Rs.50 Bond Paper. and Parents with Girl must and should attend Hostel to get final instructions. 

గమనిక : పద్దతి పాటించే బ్రాహ్మణ బాలికలకు మాత్రమే తులసీవనం హాస్టల్ లో ఉచిత సీటు లభిస్తుంది.

 1. అలాగే ఇంటర్ నుండి పీజీ వరకు, మరియు ఎంసీఏ , ఎంబీఏ , బి టెక్ , టెక్నీకల్ కోర్సులు , ఫార్మసీ కోర్సులు, ఇతర ఏదేని చదువు కోరుకుంటే సదర్ కాలేజీలో చేరి మా వద్ద హాస్టల్ లో ఉండవచ్చు ,
 2. ఇంటర్ , డిగ్రీ లకు ఐతే మన హాస్టల్ దగ్గరలోనే కాలేజీలు ఉన్నాయి … అక్కడ జాయిన్ చేస్తాము.
 3. ఫీజు అనేది తల్లి తండ్రుల ఆదాయము, వృత్తి పై ఆధార పడి ఉంటుంది. అలాగే బాలికలు పూర్తిగా బ్రాహ్మణ పద్ధతులు, సంప్రదాయాలు పాటించాలి.
 4. అహంకారము, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారు మా వద్దకు రావద్దు. ఇది పది మంది బ్రాహ్మణ బాలికల భవిష్యత్తుకు ఏర్పాటు చేసిన సంస్థ.
 5. ఇక్కడ మోతుబరి మాటలు, అధర్మ పద్ధతులు, రాజకీయాలు, స్వార్థాలు, చికాకులు కల్గించే వారికి స్థానం లేదు. పద్ధతులు బాగులేవు అంటే మేము ఎప్పుడైనా బయటకు పంపుతాము .. ఇది గుర్తు పెట్టుకుని చదువు బాగా చదవాలి, మా అమ్మాయి బాగుండాలి అనుకునే వారు మాత్రమే ఇక్కడ రండి.
 6. ఇక్కడ ఫోన్ లు ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం, ఉదయం లేవగానే ఫోన్ లు ముందేసుకుని కూర్చోవడం .. ఇతర బాలికలను ఇబ్బని పెట్టడం చేస్తే వెంటనే ఖాళీ చేసి వెళ్లి పోవాలి.
 7. సంస్కారం, పద్ధతులు, సంప్రదాయాలు పాటించే బ్రాహ్మణ బాలికలకు ఇక్కడ పుస్తకాలు, పెన్నులు, ఆహారం, హాస్టల్ అన్ని ఉచితమే.
 8. కాల్స్ చెయ్యరాదు
  బాలిక వివరాలు పంపాలి అంటే పేరు, గోత్రము, ఎం చదువుతున్నది, ఇప్పుడు ఎం చదవాలి అనుకుంటున్నది అనే విషయాలు రాస్తే మీకు ఇంటర్వ్యూ డేట్ ఇవ్వబడుతుంది .. అప్పుడు మీరు రావాలి.
 9. అలాగే కాలేజీ గురించి తెలియ చేస్తాము .. తల్లి తండ్రులు , పిల్లలను తీసుకు వెళ్లి అడ్మిషన్ పొందాలి. ఫీజు ముందు మీరే చెల్లించాలి … సదరు రిసిప్ట్ హాస్టల్ లో ఇవ్వాలి.
 10. ఆరునెలల తర్వాత అర్హతలను బట్టి 100% ఫీజ్ తల్లి తండ్రుల అకౌంట్ లోకి జమ చెయ్యడం జరుగుతుంది. దానికి డిమాండ్ చెయ్యరాదు.
 11. చివరిగా మా వద్ద చేర్చేప్పుడు ఎలా ఉన్నారో పిల్ల చదువు పూర్తి అయ్యేదాకా అలాగే ఉండాలి .. మా పిల్ల అలాగే ఉంటుంది , అనే మాటలు మాట్లాడే వారు అస్సలు రాకండి ..
 12. ఆపై అమ్మాయి చదువులో కూడ శ్రద్ద పెట్టి చదవాలి 90% మార్కులు తెచ్చుకోవాలి .. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం , ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం ఇక్కడ నడువదు ,
 13. ప్రతి రోజు కాలేజీలో ఎం చెప్పారు ? ఎం కావాలి అనేది హాస్టల్ డైరీ లో రాయాలి. పరీక్ష ఫెయిల్ ఐతే వెంటనే బట్టలు తీసుకుని వెళ్ళిపోవాలి .. ఫెయిల్ ఐన వారు అపరాధ రుసుము రూ 5000 చెల్లించి వెళ్ళాలి.

This service only for Brahmin Girls., and not for boys clearly. and Don’t ask financial help for out side studies.. Brahmin Girls must stay in our Hostel to get all facilities., 

 • No financial Support for Outside students.

 • This is only for brahmin  Girls

 • Every student must attend with parients for Admission. 

 • for Inter and Degree College will be starts from June 20th, 2024., But book your seat.

 1. For Degree apply now with DOST online APP. for Degree college courses and details contact with Smt Sailaja Madam
  +91 99481 11668

 2. For B.Tech and other PG Courses, MBA,MCA you can follow college admission notifications, Through online or Notifications. then apply for the same.  

 • for Hostel Seat you have to submit your Adhar Card and Caste certificate.
 • for Seat any time welcome
 • Not only for Education, for Internship, Trainings, Job searching, for Exams, we will provide Free Hostel for Brahmin Girls. 
 • But Hostel is very strict., must and should follow our tradition, habbits. 
 • Divorced or Disturbed women not allowed. 
 • for Education., Brahmin Girls can approach with Adhar card, Marks memo, TC 
 • send the documents through Whatsapp no. 9701609689
 • for Inter or Degree or B.Tech after getting result you can come. 
 • for Admission from other states you must bring Migration certificate, TC etc.. documents.. 

Please Submit this agreement before joining hostel … on Rs.50 rupees bond paper. is mandatory.

హాస్టల్ లో చేరడానికి అగ్రిమెంట్ : తల్లి తండ్రి వ్రాసి ఇస్తున్న హామీ పత్రము

నా పేరు .. .. .. .. .. .. (ఇంటిపేరు, పూర్తి పేరు రాయాలి) నా వృత్తి  ..  .. . .. నేను నా భార్య శ్రీమతి .. .. .. .. తులసి వనం గురించి పూర్తిగా చదివాము. ఇందులో ఉన్న కండిషన్ లు అన్నీ అర్థం చేసుకున్నాము. మేము సంపూనమైన నమ్మకం తో మా అమ్మాయిని ఇక్కడ చేర్చుతున్నాము. పిల్లల భవిష్యత్తు కోసం తులసీవనం ఏర్పాటు చేసిన శ్రీ గిరి ప్రసాద్ గారికి మా ధన్యవాదములు.  మా అమ్మాయి పేరు .. .. .. .. వయసు .. .. . .. ప్రస్తుతం ఇంటర్ / డిగ్రీ / బి టెక్ /పీజీ /ఇతర కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇక్కడ వచ్చాము,. కాలేజీలో జాయిన్ అయ్యాక మొదలు మేమే ఫీజ్ కట్టి సదరు రిసిప్ట్ తులసీవనం వ్యవస్థాపకులు శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారికి సమరిపించాలి అని తెలుసుకున్నాము. మా ఆర్థిక పరిస్తితి మరియు మా ఉద్యోగ పరిస్తితి చూసి మేము అర్హులు అని వారు భావిస్తే మాకు ఫీజు విషయం లో సహకారం అందిస్తారు అని తెలుసుకున్నాను., ఇది తప్పని సారి ఏమి కాదు అని కూడా తెలుసుకున్నాను.

క్రింద కనుపరచిన కండిషన్ లు మేము ఒప్పుకుంటున్నాము.

 1. మా అమ్మాయి ఉదయం 6 లోపే నిద్ర లేవాలి అన్నది ప్రధాన మైన కండిషన్ అది ఒప్పుకున్నాము
 2. బ్రాహ్మణ హాస్టల్ కాబట్టి ఇతర బాలికలపై మా అమ్మాయి ఎటువంటి ఇబ్బంది పెట్టదు అని ఒప్పుకుంటున్నాము.
 3. ఇతర విషయాల్లో కలుగ చేసుకోము అని కూడా తెలియ చేస్తున్నాము
 4. భోజనము, నిద్ర, బ్రాహ్మణ పద్దతుల్లో మా అమ్మాయి తప్పని సరిగా సహకరిస్తుంది అని తెలియ చేస్తున్నాము.
 5. మా అమ్మాయి ఇక్కడ ఉండి చదువుకునే రోజుల్లో ఇక్కడ హాస్టల్ అభివృద్ధి, చదువుకు , హాస్టల్ లో ఉన్నారు అని తెలియ చేయడం , ఇంటర్వ్యూ లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరూ పిల్లలతో లేదా విడిగా కూడా వెబ్సైట్ లో పెడుతారు అని తెలుసుకున్నాము .. మా అమ్మాయి చదువు ఐపోయినా తరువాత లేదా దీర్ఘ కాలికంగా హాస్టల్ వెబ్సైట్ లో ఫోటోలు, వీడియోలు ఉంచుతారని తెలుసుకున్నాము, ఒప్పుకుంటున్నాము. ఈ విషయం లో మాకు ఎలాంటి భయంతరము లేదు. భవిష్యత్తులో మా అమ్మాయి ఇక్కడ షరతులకు లోబడి చదువుకుంటుందని కూడా తెలియ చేస్తున్నాము
 6. హాస్టల్ /తులసీవనం లో ఇదే వంట కావాలి, అది కావాలి, ఇది కావాలి అని మాట్లాడే అవకాశం లేదు అని కూడా తెలుసుకున్నాము.
 7. ఇక్కడ చదువుకునే సమయం లో మా స్వగ్రామానికి లేదా పెళ్లిళ్లకు ఇతర టూర్స్ కు ఎక్కువగా పంపరని తెలుసుకున్నాము.
 8. తులసీవనం హాస్టల్ కు గాని , శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారికి గాని మేము ఎటువంటి రుసుము లేదా విరాళము ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుసుకున్నాము.
 9. మా అమ్మాయి చదువు విషయం లో జాగ్రత్తగా ఉంటుందని తెలియ చేస్తున్నాము, ప్రతి పరీక్ష రిజల్ట్ విధిగా హాస్టల్ లో తెలియ చేస్తుందని తెలియ చేస్తున్నాము.
 10. మా అమ్మాయి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక్కడ ఉండే అవకాశం లేదు అనే కండిషన్ ఉంది కనుక , మేమే తీసుకు వెళ్తాం అని తెలియ చేస్తున్నాము. ఇందులో శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారిపై మేము ఎలాంటి మాటలు అనే అవకాశం లేదు అని కూడా ఒప్పుకుంటున్నాము.
 11. సాయంత్రం శ్లోకాలు, మన పద్దతులు నేర్చుకోవడం, వంట ఇంట్లో సహకరించడం , భోజన విషయం లో సమయం పాటించడం .. బ్రాహ్మణ అలవాట్లు ఉండడం విషయం లో మాకు ఎటువంటి అభ్యంతరము లేదు .. రేపు తన భావిష్యత్తు కోసం తులసీవనం ద్వారా మంచి మార్గాలు అనుసరించే విషయం లో మా పూర్తి సహకారం ఉంటుందని తెలియ చేస్తున్నాము.
 12. మేము మా అమ్మాయిని తులసీవనం కండిషన్ లు అన్నీ కూడా వారి వెబ్సైట్ లో చదివి , ఇంటర్వ్యూ కు హాజరు అయ్యాక ఏ విషయం లో కూడా రేపు భవిష్యత్తులో తులసీవనం పై మేము అభియోగాలు చేయము అని తెలియ చేస్తున్నాము.
 13. నేటి విద్యావిధానం లో ఉన్న ఎన్నో దారుణమైన కారణాల నుండి మన బ్రాహ్మణ ఆడపిల్లలు జాగ్రత్త పడి మంచి భవిష్యత్తు కోరుకునే విధంగా తులసీవనం మంచి కండిషన్ లు పెట్టింది అని తెలుసుకున్నాము. అవి మేము కూడా పాటిస్తాము.
 14. తులసీవనం లో ఉన్న మొత్తం రోజుల్లో మా అమ్మాయి ఎటువంటి చెడు అలవాట్లు గాని , ప్రేమ , పెళ్లి అనే విషయాల్లో జాగ్రత్త పడి , వాటిని అనుసరించబోదని తెలియ చేస్తున్నాము. తులసీవనం కండిషన్ల విషయం లో ఎప్పుడు అయిన మా అమ్మాయి గరిష్టముగా మూడు మార్లు తప్పుగా ప్రవర్తిస్తే శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారు వెంటనే మా అమ్మాయిని హాస్టల్ నుండి తొలగిస్తారని కూడా మేము తెలుసుకున్నాము .. మేము ఎలాంటి అభ్యంతరాలు చెప్పేది ఉండదు అని కూడా తెలియ చేస్తున్నాము.
 15. మా అమ్మాయికి తులసీవనం లో అయ్యే నెలసరి ఖర్చు కూడా రూ 8000 పైమాటే అని కూడా తెలుసుకున్నాము. మేము మధ్యలో వెళ్లిపోవాలి అనుకుంటే ఎన్ని రోజులు ఉంటుందో అన్నీ రోజులకు గాను సదరు అమౌంట్ పే చేసి తీసుకు వెళ్తాము అని కూడా తెలియ చేస్తున్నాము.
 16. మా అమ్మాయి విషయం లో తల్లి తండ్రి తరువాత శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారే తదుపరి సంరక్షకుడుగా ఉంటారని కూడా తెలుసుకున్నాము. ఇక్కడ పూర్వపు విద్యార్థినులను కనుక్కున్నాము. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని , అలాగే శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారు పిల్లలను తమ పిల్లల వలె చూసుకుంటారు అని కూడా తెలుసుకున్నాము. కనుక ఆయన మా అమ్మాయి తప్పు చేస్తే ఒక మాట అనే హక్కు కూడా ఉందని తెలియ చేస్తున్నాము.
 17. తులసీవనం లో వంటవారు , పని వారు ఉన్నారు అని తెలుసుకున్నాము. బట్టలు మాత్రం విద్యార్థినులు ఎవరికి వారు వాషింగ్ మిషన్ లేదా ఉతుక్కోవలని కూడా తెలుసుకున్నాము .. ఒప్పుకున్నాము.
 18. హాస్టల్ లో తాయిలెట్ లు ఎవరికి వారే క్లీన్ చేసుకోవాలని కూడా తెలుసుకున్నాము , ఒప్పుకున్నాము.
 19. తులసీవనం పై ఎలాంటి మాటలు అనడానికి మాకు అర్హత లేదు అని కూడ తెలుసుకున్నము . ఒప్పుకున్నాము.

ఈ కండిషన్ లు అన్నీ కూడా గతం లో జరిగిన అనుభవాల ప్రకారం తెలియ చేశారు అని , అలాగే మేము కూడా  అన్నీ కండిషన్ లకు ఒప్పుకుంటున్నాం అని తెలియ చేస్తున్నాము. పిల్లల భవిష్యత్తుకోసం మాత్రమే ఇన్ని కండిషన్ లు పెట్టారని కూడా తెలుసుకున్నాము. శ్రీ గిరి ప్రసాద్ శర్మ గారు నడుపుతున్న తులసీవనం అనే హాస్టల్ పట్ల అన్నీ విధాలుగా ఆలోచించి వారి ప్రతి కండిషన్ కు మేము ఒప్పుకుంటున్నాము. మా అమ్మాయి భవిష్యత్తు మాకు ముఖ్యము. కనుక ఇలాంటి హాస్టల్ దొరకడం కూడా మాకు అదృష్టముగా భావిస్తున్నాము.

ఇట్లు

తల్లి     తండ్రి      విద్యార్థిని   పేర్లు .. సంతకం మొబైల్ నంబర్ లు .. చిరునామా ..   

విద్యావిధానం అమానుషం
by Giri Prasad Sarma Kalle
www.indianbrahmins.com
Free Education for Brahmin Girls and Free Hostel too

పది లో 10/10 మార్కులు వచ్చిన విద్యార్థినికి చైతన్య సంస్థలు నీట్ తో పాటు ఇంటర్ సీట్ కు 5 లక్షలు అడిగారని మొత్తం 7 లక్షలు ఫీజ్ ఐతే 5 లక్షలు కట్టాలని ఫైనల్ చేశారని తెలిసింది .. ఇది చాల అమానుషమైన విద్యా విధానం. తల్లి తండ్రులు సామాన్య ఉద్యోగులు అయినపుడు ఇలాంటి వ్యాపార సంస్థలలో పొరపాటున కూడా చేర్చకండి .. వాట్సప్ నంబర్ : 9701609689

హైదరాబాద్ లో నృపతుంగ కాలేజీ లో మన విద్యార్థులకు నామినల్ ఫీజ్ పైన అదే చదువు అందిస్తున్నారు .. పైగా విద్యార్థినులు ఐతే బ్రాహ్మణ సంక్షేమ భవన్ నడుపుతున్న తులసీవనం బాలికల హాస్టల్ లో ఉచితంగా హాస్టల్ సౌకర్యం కూడా ఇస్తున్నాము. నృపతుంగ కాలేజీలో కూడా ఇదే క్రమం లో మార్కులు వచ్చాయి .. ప్రభుత్వ బడిలో చదివి కూడా 10/10 తెచ్చుకున్న గొప్ప విద్యార్థులు ఉన్నారు. వింత పోకడలకు పోయి పిల్లలను చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీల్లో వెయ్యకండి దయచేసి. వాట్సప్ నంబర్ : 9701609689

బ్రాహ్మణ సంక్షేమ భవన్ హైదరాబాద్ లో ఇంటర్ నుండి పై చదువులకు గాను పూర్తిగా ఉచిత కౌన్సెలింగ్ ఇస్తున్నాము .. ఎలాంటి కోర్స్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాము .. తప్పకుండా మీరు స్లాట్ బుక్ చేసుకుని హాజరు అవ్వండి .. చాల మంది సాఫ్ట్ వేర్ పై ఆసక్తి చూపుతున్నారు .. సాఫ్ట్ వేర్ అంటే గొప్ప కాదు ఈకాలం కానీ సాఫ్ట్ వేర్ వైపు వెళ్తే ఎలాంటి అనుభవాలు ఎదురు అవుతాయి అన్నది గమనించాలి. కనుక మైక్రో బయాలజీ / బయో కెమిస్ట్రీ,/ నీట్ / బి టెక్ , డిగ్రీ / సాఫ్ట్ వేర్ , ఐఏఎస్ కోచింగ్ .. ఇందులో ఏది ఎలా ఉంటుందో ఉదాహరణ తో సహా మీకు కౌన్సెలింగ్ ఉంటుంది .. మన బ్రాహ్మణ విద్యార్థులకు ఇది మొత్తం ఉచితం. వాట్సప్ నంబర్ : 9701609689

అలాగే బి టెక్ చదివే బ్రాహ్మణ విద్యార్థినీ విద్యార్థులకు కంచి చంద్రశేఖరేంద్ర స్వరస్వతి స్వామి వారి మహా విశ్వ విద్యాలయం లో కూడా అత్యున్నత ప్రమాణాలతో కంచి లో ఇంజినీరింగ్ కాలేజీ ఉంది, అలాగే తిరుపతి , మహబూబ్ నగర్, హైదరాబాద్ లలో ఇంటర్ లో అవకాశాలు ఉన్నాయి.

డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి సెక్యూరిటీ లేని కాలేజీల్లో చేర్చితే చదువు ఏమో గాని పిల్లలు మన చేతిలో ఉంటారో లేదో గమనించాలని శ్రీ గిరి ప్రసాద్ శర్మ అన్నారు .. నేటి విద్యావిధానం పూర్తిగా వ్యాపార మాయం అయ్యిందని .. అలాగే కాలేజీల్లో స్నేహితుల వల్ల సంప్రదాయ పద్ధతులు రాకపోగా తల్లి తండ్రులకు వ్యతిరేకంగా పిల్లలు దారి తప్పే అవకాశాలు చాల ఉన్నాయి అని అన్నారు.

ఈ విషయం లో తల్లి తండ్రులకు , విద్యార్థులకు కౌసిలింగ్ చాల అవసరం అని అన్నారు. విద్యార్థులు తమ చదువు, ఎం చెయ్యాలి అనుకుంటున్నారు అనే విషయాలు వాట్సాప్ చేస్తే వారికి ఉచిత కొన్సెలింగ్ ఇస్తున్నారు … వాట్సప్ నంబర్ : 9701609689

మీకు ఓ విన్నపము : చదవండి చదువు అంటే ఏమిటో :

పిల్లలు వారికి నచ్చింది లేదా వారి స్నేహితులు లేదా మీరు చెప్పింది విని ఎదో ఒక కోర్స్ చేస్తారు , అలాగే మీరు పడుతున్న కష్టాలు చూసి పిల్లలు బాగా సంపాదించాలని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వాలనే కోరిక బలంగా ఉంది పిల్లలకు , అలాగే బ్యాంకు లో చెయ్యాలి లేదా ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంది.

గమనించండి. చదువుకునే సామర్థ్యం, మంచి మార్కులు తెచ్చుకునే తెలివి ఉన్నపుడు వారికి మంచి దారి మనం ఇవ్వాలి. అదే తులసీవనం చేస్తున్న ప్రయత్నం. వివరణ : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వాలి అంటే ఏమి చదవకుండానే పది ఇంటర్ నుండి సాఫ్ట్ వేర్ నేర్చుకుని ఇంజినీర్ అవ్వచ్చు … కానీ ఒకటి ఆలోచించండి. సాఫ్ట్ వేర్ అంటే ఒక కంపెనీ లో చెయ్యాలి లేదా మనకు మనం చేసుకోవాలి .. రెండు కూడా మనకు వచ్చే ప్రాజెక్ట్స్ పై ఆధార పడి చెయ్యాలి. కంపెనీ లో నుండి నిన్ను ఎప్పుడైనా తీసెయ్య వచ్చు .. లేదా కంపెనీ ఎత్తెయ్య వచ్చు … అప్పుడు మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి . .లేదా స్వంతంగా చెయ్యాలి .. ఒక్కరే చేసే ప్రాజెక్ట్ ఏది ఉండదు .. అంటే ఒక సాఫ్ట్ వేర్ తయారు చెయ్యాలి అంటే ఫ్రంట్ ఎండ్ , బ్యాక్ ఎండ్, డిజైనింగ్, మార్కెటింగ్, ప్యాకేజ్ మాట్లాడ్డం, ప్రాజెక్ట్ ఇచ్చిన వారికి నచ్చజెప్పడం మరియు సరి ఐన సమయం లో వారికి ప్రాడక్ట్ ఇవ్వడం జరగాలి .. ఇదంతా అంత ఆషామాషీ కాదు .. ఎవరు నిన్ను నమ్మి ఇవ్వరు. కనుక సాఫ్ట్ వేర్ అంటే సముద్రం లో ప్రయాణం … ఎప్పుడు గాలి వానా వస్తుందో తెలియదు.

అలాగే బాంక్ లేదా ఇతర ఉద్యోగాలు చేస్తే నీకు వచ్చే జీతం నీకు పిల్లలు పుడితే వారి ఖర్చులకే సరిపోదు .. నెలంతా పని చేసి కష్టపడి ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చినా వచ్చే జీతం ఏ 50 వేలో లక్ష ఉంటుంది. అది జీవితం లో సరిగా సాగడానికి నీకు సరిపోదు. నేటి ఖర్చులను బేరీజు వేసుకుంటే చావులు, పుట్టుకలు, ఫంక్షన్ లు , బంగారం, ఇల్లు, బంధువులు ఇవన్నీ పై ఖర్చులే .. ఇక నీ వ్యక్తిగతం ??

కనుక పిల్లలూ .. మీరు ఇక్కడ మీకు నచ్చింది చదివి పాస్ అవుతూనే ఓక వైపు ఐఏఎస్ కోచింగ్ కూడా తీసుకోవాలి .. ఒక్కసారి గట్టిగా నీవు నీ కుటుంబం నీ భవిష్యత్తు బాగుండాలంటే నీవు జిల్లా కలెక్టర్ కావాలి .. అప్పుడు నీవే వందల మందికి ఉద్యోగాలు, ఉపాధి, సహాయాలు చెయ్యవచ్చు .. . నేడు మన బ్రాహ్మణులూ తప్ప అందరు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు .. మనం సగం సగం జీతాలతో జీవితాలను అగమ్యగోచరం చేసుకుంటున్నాం.

కనుక దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ ఇంటర్ లో జాయిన్ ఐతే మీరు డిగ్రీ, బి టెక్ , తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మా వద్ద ఉచిత చదువు, ఉచిత హాస్టల్ పొంది మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుకోండి ..

పేరెంట్స్ కు విన్నపం :

మీ పిల్లలు మా వద్దకు వస్తే , ఇంటర్ 2 ఏళ్ళు, డిగ్రీ లేదా బిటెక్ 3 లేదా 4 ఏళ్ళు …వారిని హాయిగా చదువుకోనివ్వాలి .. మధ్యలో పెళ్లి, పేరంటం అంటూ వారిని మీరు డిస్టర్బ్ చెయ్యొద్దు .. వారు ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అంటే ఆరు లేదా ఏడేళ్లు వారిని కేవలం చదువు అంటే *తులసీవనం* లో వదలి పెట్టండి. మీరు వారు బాగుంటారు …

నేటి సమాజం లో మన పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చెయ్యక పొతే , చదువు వచ్చినా, ఉద్యోగం వచ్చినా మీ పిల్ల మీ ఇంట్లో ఉండదు .. కాలేజీల్లో పరిస్థితి బాగులేదు .. అలాగే చిన్న నాటి నుండే పిల్లలకు మంచి పద్ధతులు , భవిష్యత్తు గురించి అవగాహన కల్పించాలి. ఏదైనా జరిగితే వారి తప్పు కాదు పెద్దలుగా మన బాధ్యత, తప్పు అవుతుంది. కనుక పరిస్థితులు మనకు ఎప్పుడు అనుకూలంగా ఉండవు. మీ పిల్లల బాధ్యత మాది మరియు వారి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం లో చేరే దాకా మా వద్దనే క్షేమంగా ఉంటారు. కానీ ఇక్కడ కండిషన్ లు పాటించాలి.

మీ మరియు మీ పిల్లల భవిష్యత్తు కోసం మా శ్రమ వృధా కారాదు అన్నది మా ఆలోచన.

మీ గిరి ప్రసాద్ శర్మ కళ్ళే
వ్యవస్థాపక అధ్యక్షులు

ఇది మొత్తం చదివి ప్రశాంతంగా ఉండే కుటుంబాలు మాత్రమే వారి పిల్లలను ఇక్కడ చేర్చాలి

 1. చాల మంది ఆవేశం, మోతుబరి మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ నడువదు
  ఇక్కడ మా కాన్సెప్ట్ ఏమిటంటే : ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి
  కాలేజిలు , చదువులు, సమాజం బాగులేదు మనకు ప్రమాదం
  ఇక్కడ మంచి అలవాట్లు, పద్ధతులు నేర్పుతాము
  ప్రతి రోజు మన పిల్లల భవిష్యత్తుకోసం మాత్రమే పని చేస్తాము
 2. ఇక్కడ పద్ధతులు పాటించకుండా మీ ఆవేశాలు మాపై చూపరాదు
 3. డబ్బులు ఇస్తాము, ఇష్టం వచ్చినట్లు ఉంటాము అనేవారు అసలు మా గడప తొక్కకండి
 4. ఇది తులసీవనం .. మంచి భవిష్యత్తు కోరుకునే బ్రాహ్మణ ఆడపిల్లలకు మాత్రమే ఇక్కడ ప్రవేశం
 5. చదువు, తిండి, నిద్ర సరిగా ఉండాలి ఇక్కడ ..
  సమయం వృధా చేస్తూ ఫోన్ లు పట్టుకుని కూర్చోరాదు
 6. ఉదయం లేచి అలాగే కూర్చోరాదు .. వెంటనే స్నానం చేసి తయారు అవ్వాలి
  రెస్ట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు ..
 7. డ్రస్ కోడ్ కూడా ఏమి లేదు
  పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉండాలి .. ఎక్కువ తక్కువ ఫీలింగ్ లు ఉండరాదు
 8. బ్రాహ్మణ ఆడపిలల లాగా మంచి అణుకువ, మంచితనం ఉండాలి
  లవ్ లు, లెట్ గా రావడాలు , అపద్దాలు చెప్పేవారు అసలు రావద్దు
 9. మా వద్దకు
  మీ పిల్లల వల్ల హాస్టల్ కు గాని, నాకు గాని ఇబ్బంది ఐతే వెంటనే వెళ్లి పోవాల్సి ఉంటుంది

 10. ఇక్కడ పని మనుషులు, వంట, అంట్లు తోమే వారు ఉన్నారు
  కానీ టాయ్ లెట్ లు పిల్లలే క్లిన్ చేసుకోవాలి

 11. వంట గదిలో కూడా పిల్లలు కూరలు తరగడం, పోపు వెయ్యడం లాంటివి చెయ్యవచ్చు.

 12. మా హాస్టల్ లో ఎవరైనా లవ్ లేదా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అదే రోజు ఇంటికి పంపుతాము
 13. .. మాపై ఏమాత్రం మాటలు అనరాదు .. ఎవరికీ అర్హత లేదు. ఇవన్నీ ముందే ఆలోచన చెయ్యాలి
 14. .. మా పాప లేవదు .. చిన్నప్పటి నుండి అంతే అనేవారు ఇక్కడకి రాకండి .. మీ ఆవేశాలు , మీ రోషాలు మీ వద్దనే ఉండని

ఇవన్నీ అనుభవించాము కాబట్టి రాస్తున్నాము
మాతో ఎక్కువ తక్కువ మాట్లాడే వారు అవసరం కొద్దీ ప్రేమ చూపించే వారు ఇక్కడకి రాకండి ..

మ్యాచ్ అవ్వరు మాతో.

*గిరి ప్రసాద్ శర్మ కళ్ళే*

for Inter and Degree Admissions., Please visit.  *TULASEEVANAM* office with your daughter, Marks card, TC and Bonafied., All courses available., Get Free seat in Hostel and then college admissions as per College process., Number of colleges are there. Allotments based on Merit only Min.75% marks should be in previous Class is mandatory. 

Whatsapp your daughter details to 9701609689.,. Then sir will guide how to get seat in Free Hostel and College Seat. 

 

Please note : Tulaseevanam for all state Brahmin Girls purpose. Free Hostel and Free Education from Intermediate to PG any course., All courses available. in this page you can find .. if not available , whatsapp me about your requirement subject., course, study . we will answer you. 

कृपया ध्यान दें: सभी राज्य ब्राह्मण लड़कियों के उद्देश्य के लिए तुलसेवनम। नि: शुल्क छात्रावास और इंटरमीडिएट से पीजी तक मुफ्त शिक्षा किसी भी पाठ्यक्रम, सभी पाठ्यक्रम उपलब्ध हैं। इस पृष्ठ में आप पा सकते हैं .. यदि उपलब्ध नहीं है, तो मुझे अपनी आवश्यकता विषय के बारे में व्हाट्सएप करें। हम आपको जवाब देंगे। 

ದಯವಿಟ್ಟು ಗಮನಿಸಿ : ಎಲ್ಲಾ ರಾಜ್ಯ ಬ್ರಾಹ್ಮಣ ಹುಡುಗಿಯರ ಉದ್ದೇಶಕ್ಕಾಗಿ ತುಳಸೀವನಂ. ಯಾವುದೇ ಕೋರ್ಸ್ ಗೆ ಇಂಟರ್ ಮೀಡಿಯೇಟ್ ನಿಂದ ಪಿಜಿವರೆಗೆ ಉಚಿತ ಹಾಸ್ಟೆಲ್ ಮತ್ತು ಉಚಿತ ಶಿಕ್ಷಣ., ಎಲ್ಲಾ ಕೋರ್ಸ್ ಗಳು ಲಭ್ಯವಿದೆ. ಈ ಪುಟದಲ್ಲಿ ನೀವು ಕಾಣಬಹುದು .. ಲಭ್ಯವಿಲ್ಲದಿದ್ದರೆ, ನಿಮ್ಮ ಅವಶ್ಯಕತೆಯ ವಿಷಯದ ಬಗ್ಗೆ ನನಗೆ ವಾಟ್ಸಾಪ್ ಮಾಡಿ., ಕೋರ್ಸ್, ಅಧ್ಯಯನ . ನಾವು ನಿಮಗೆ ಉತ್ತರಿಸುತ್ತೇವೆ. 

குறிப்பு : துளசீவனம் அனைத்து மாநில பிராமண பெண்கள் பயன்பாடு. இலவச, விடுதி மற்றும் இடைநிலை முதல் முதுகலை வரை ஏதேனும் ஒரு படிப்பு வரை அனைத்துப் படிப்புகளும் உள்ளன. இந்த பக்கத்தில் நீங்கள் காணலாம் .. கிடைக்கவில்லை என்றால், உங்கள் தேவை பாடத்தைப் பற்றி எனக்கு வாட்ஸ்அப் செய்யுங்கள்., படிப்பு, படிப்பு. நாங்கள் உங்களுக்கு பதிலளிப்போம். 

Tulaseevanam
Whatsapp No. 9701609689

For Admission : Please share Brahmin Girl Name : Gotram, District, State and which education she required and what is her percentage in previous year…and Father Profession.. Whatsapp Number. to Whatsapp No. 9701609689. All Courses Available. first you have to send details and then we will guide you all. 

Please don’t ask about boys education or out side study financial help., 

Please don’t make calls for enquiry or unnecessary issues., just send your girl name, education and further what she want to do. to my Whatsapp No.9701609689.  then I will inform you about the education and courses.

Dear Parents, Our AIM is to provide Best Hostel Service with security, Traditional Meals to our Brahmin Girls., second thing is for Eduction they have to choose what course they have to continue, we will support them. If the family having low income, we are providing 100% fee reimbursement.

TULASEEVANAM
(Brahmin Girls Educational Academy) 

3-4-1005/6 Barkatpura, Hyderabad 500027
Beside Raghavendra Tiffins or Rajadhani Bank
DANTUPALLY CHAMBERS

Barkatpura to Nallakunta Road

Our well-wishers provide a range of top-quality services to keep your education smoothly.