Brahmins Welfare Community Hall - Barkatpura
🕉️
బ్రాహ్మణ సమాజ సేవలో మరో ముందడుగు

BRAHMINS WELFARE
COMMUNITY HALL

📍 BARKATPURA, HYDERABAD

ప్రియమైన బ్రాహ్మణ బంధువులకు నమస్కారం.

మన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో, బర్కత్‌పురా ప్రాంతంలో 300 నుండి 500 మంది వరకు ఒకేసారి ఉపయోగించుకోగల మంచి Community Hallను దీర్ఘకాలిక Lease పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించాను.

ప్రస్తుతం Tulasee Vanam / Brahmins Welfare Bhavan ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అయితే అక్కడ ఒకేసారి సుమారు 50–60 మందికి మాత్రమే సౌకర్యం ఉంది.

మన Subsidy Stores, అన్నదానం, సేవా కార్యక్రమాలు, సమావేశాలు వంటి సందర్భాల్లో ఎక్కువ మంది వచ్చినప్పుడు స్థలం సరిపోవడం లేదు. అంతేకాకుండా బియ్యం బస్తాలు, కిరాణా సరుకులు మరియు ఇతర వస్తువులను పై అంతస్తులకు Lift ద్వారా తీసుకువెళ్లడం కూడా చాలా కష్టంగా మారుతోంది.

అందువల్ల మన సమాజానికి దీర్ఘకాలంగా ఉపయోగపడే విధంగా, 300–500 మంది సామర్థ్యం కలిగిన AC Community Hallను 10 సంవత్సరాల Leaseకు తీసుకోవాలని నిర్ణయించాము.

🏛️ Hallలో ప్రతిపాదిస్తున్న సౌకర్యాలు

❄️ AC Function Hall
🍽️ Kitchen
🪑 Dining / Service Area
🛋️ Furniture
🎉 Basic Function Facilities
🤝 Community Meetings & Welfare Activities

ఈ Hallను కేవలం సంస్థ కార్యక్రమాలకే కాకుండా, బ్రాహ్మణ కుటుంబాల వివాహాలు, నిశ్చితార్థాలు, ఉపనయనాలు, శుభకార్యాలు, సమావేశాలు మరియు ఇతర ధార్మిక కార్యక్రమాలకు కూడా అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాము.

Hyderabadలో మంచి Function Hall తీసుకోవాలంటే ఒక్క కార్యక్రమానికే లక్షల్లో ఖర్చు అవుతోంది. అందుకే మన Brahmin Familiesపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఒకే సరళమైన రేటుతో సేవ అందించాలని నిర్ణయిస్తున్నాము.

ప్రతిపాదిత HALL CHARGE
₹50,000/- Per Day
AC Hall + Furniture + Kitchen Facilities

Hallను కొనుగోలు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. అందువల్ల ప్రస్తుతం 10 సంవత్సరాల Long-Term Lease మనకు ఆర్థికంగా మరియు సేవా పరంగా అనుకూలమైన మార్గంగా భావిస్తున్నాము.

🙏 ఈ సేవలో మీ సహకారం కావాలి

Hall Advance, Infrastructure, Furniture, AC మరియు ఇతర ప్రారంభ ఏర్పాట్ల కోసం సుమారు ₹30 లక్షల వరకు అవసరం ఉంటుందని అంచనా.

Monthly Rent / Lease Charges మరియు Maintenanceను Brahmins Welfare Bhavan, Tulasee Vanam, Sumavanam ద్వారా మేమే నిర్వహించేందుకు ప్రయత్నిస్తాము.

ఈ ప్రారంభ ఏర్పాటుకు సహకరించగల వారు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.

1️⃣
Interest-Free Support

3 సంవత్సరాల కాలానికి వడ్డీ లేకుండా ఆర్థిక సహాయం చేయగల వారు ముందుకు రావచ్చు.

అందించిన మొత్తానికి సంస్థ కార్యాలయం ద్వారా Proper Receipt / Written Acknowledgement ఇవ్వబడుతుంది.

2️⃣
One-Year Financial Support – 1% Per Month

ఒక సంవత్సరం కాలానికి ఆర్థిక సహాయం చేయదలచిన వారు నెలకు 1% వడ్డీతో సహాయం చేయవచ్చు. అంటే: 12% Per Annum – Simple Interest Only

ఉదాహరణకు, ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తే:
నెలకు వడ్డీ: ₹1,000
12 నెలలకు మొత్తం వడ్డీ: ₹12,000

ఇది Compound Interest కాదు; Simple Interest మాత్రమే. ఇటువంటి ఆర్థిక సహాయం సంబంధిత రాతపూర్వక ఒప్పందం, లెక్కలు మరియు వర్తించే నిబంధనలకు అనుగుణంగా స్వీకరించబడుతుంది.

ఇది వ్యక్తిగత వ్యాపారం కోసం కాదు. మన బ్రాహ్మణ సమాజానికి ఉపయోగపడే Community Facility కోసం చేస్తున్న ప్రయత్నం కాబట్టి, నెలకు 1% కంటే ఎక్కువ వడ్డీ ఆశించకుండా సహకరించాలని మనవి.

3️⃣
Donations / Contributions

తిరిగి తీసుకోవాలనే ఉద్దేశం లేకుండా Contribution / Donation ఇవ్వదలచిన వారు కూడా తమకు సాధ్యమైన మొత్తంలో సహకరించవచ్చు.

ప్రతి చెల్లింపుకూ మా కార్యాలయం నుండి Proper Receipt పొందవచ్చు.

🌸 ప్రధాన దాతకు ప్రత్యేక గౌరవం

Community Hall ప్రారంభానికి అవసరమైన మొత్తం Advanceను ఒకే దాత అందించడానికి ముందుకు వస్తే, వారి సేవకు గుర్తింపుగా, పరస్పర అంగీకారంతో Hallకు వారి పేరు లేదా వారి కుటుంబ సభ్యుల పేరు పెట్టే అవకాశం కల్పించాలని భావిస్తున్నాము.

మన ఉద్దేశం ఒక్కటే:

"మన బ్రాహ్మణ కుటుంబాలకు అందుబాటు ధరలో, గౌరవప్రదమైన,
అన్ని అవసరమైన సౌకర్యాలతో కూడిన ఒక మంచి Community Hall ఉండాలి."

మనం కలిసి చేస్తే ఇది సాధ్యమే.

📅 మా లక్ష్యం

వచ్చే నెలలోనే Hallను ప్రారంభించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. అందువల్ల సహకరించాలనుకునే వారు వీలైనంత త్వరగా స్పందించాలని ప్రార్థిస్తున్నాను.

అవకాశం ఉన్నవారు ఒక్కసారి మా కార్యాలయానికి వచ్చి ప్రత్యక్షంగా చర్చించండి. Hall అవసరం, Lease, Advance, Infrastructure, నిర్వహణ విధానం మరియు ఇతర అంశాలను వివరంగా తెలియజేస్తాము.

🙏 మీ సహకారం

వందలాది బ్రాహ్మణ కుటుంబాలకు ఉపయోగపడే ఒక మంచి సేవా వేదికగా మారుతుంది

Giri Prasad Sarma Kalle

WhatsApp: 9701609689

BRAHMINS HELP DESK
Registered Name
Global Brahmins Welfare Association
Reg. No. 64/2014
REGISTERED ADDRESS
#3-4-1005/6 Dantupally Chambers, 5th Floor,
Beside Rajadhani Bank, Barkatpura,
Hyderabad – 500027
Giri Prasad Sarma Kalle
Founder
📲 9701609689
Vedanthi Pandey
Administrative Officer
📲 9391201528
🕉️ సర్వే జనాః సుఖినో భవంతు 🕉️
🏛️

Brahmins Welfare Community Hallబ్రాహ్మణ్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్

Barkatpura, Hyderabad — Support this initiativeబర్కత్‌పురా, హైదరాబాద్ — ఈ కార్యక్రమానికి మీ సహకారం

💰 Support the Community Hallకమ్యూనిటీ హాల్‌కు సహకారం

🚫 We accept ONLY Cheque or NEFTమేము కేవలం Cheque లేదా NEFT మాత్రమే స్వీకరిస్తాము
No Cash. No PhonePe. No GPay. All payments must be by Cheque or NEFT only.నగదు వద్దు. PhonePe వద్దు. GPay వద్దు. అన్ని చెల్లింపులు Cheque లేదా NEFT ద్వారానే స్వీకరించబడతాయి.
BRAHMINS HELP DESK
A/C No: 50200053822560
IFSC: HDFC0004326
Branch: Moosarambagh Branch
Account Type: Current Account
Mobile: 9701609689
You can do NEFT, or drop a Cheque, or issue a Cheque at our office — any time.మీరు NEFT చేయవచ్చు, లేదా Cheque డ్రాప్ చేయవచ్చు, లేదా మా కార్యాలయంలో Cheque ఇవ్వవచ్చు — ఎప్పుడైనా.
After making the payment, enter the payment details belowచెల్లింపు చేసిన తర్వాత, దిగువ చెల్లింపు వివరాలు నమోదు చేయండి

🧾 Check My Receiptనా రసీదు చూడండి

📊 Community Hall — Progress So Farకమ్యూనిటీ హాల్ — ఇప్పటి వరకు పురోగతి

🔐 Admin Login

🔐 Admin Panel

Edit Record